telugu 5th lesson
వ్యక్తీకరణ - సృజనాత్మకత
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయండి.
జ. అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో, హైదరాబాద్ నగరంపై సీరియల్గా రాసిన మినీకవితల సంపుటి 'సిటీలైఫ్', ఈ సంపుటి నగరంలోని మూలలను, మూలాలను కళ్ళకు గట్టినట్లు చూపించి, మనసు కిటికీ తెరచి చూస్తే ఈ సంపుటిలోని అక్షరాల వెనుక అనంతదృశ్యాలు కనిపిస్తాయి. సిటీలైఫ్ మినీ కవితల్లో కొసమెరుపు కవిత్వానికి జీవలక్షణంగా ఉంది. ఈ కవితల్లో భావం, శిల్పం రెండూ మెదడును వెలిగించి, గుండెను కదిలిస్తాయి.
ఆ) "నగరజీవికి తీరిక దక్కదు. కోరిక చిక్కదు” అనే కవితాపంక్తుల్లోని వాస్తవాన్ని వివరించండి.
జ. నగరవాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్లు ఉంటాయి కాబట్టి ఆఫీసు వేళకు చాలాముందుగానే వారు బయలుదేరాలి. తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది. అలాగే కూలిపనులు చేసి జీవించేవారికి కూడా, వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికీ, పోవడానికీ ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు.
ఎంత కష్టపడినా నగరజీవి చిరుసంపాదనతో వారి కోరికలు తీరవు. తిండికీ, బట్టకూ, ప్రయాణాలకూ వారికి ఖర్చయిపోతుంది. అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక చిక్కదు అని కవి నిజం చెప్పాడు
ఇ) నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఆంతర్యం ఏమిటి?
జ. పట్టణాలకు వచ్చి ఏవో సుఖాలను అనుభవించాలనుకొనే వారికి, పట్టణాల నిజస్వరూపాన్ని తెలపడమే కవి యొక్క ఆంతర్యం. నగరాల్లో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటారని భ్రాంతిపడే పల్లె ప్రజలకు, పట్టణాల్లో ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయనీ, పేద, మధ్యతరగతి ప్రజలకు నగరజీవనం, సమస్యల వలయం అనీ చెప్పడమే కవి ఆంతర్యం.
నగరజీవనం 'పద్మవ్యూహం' లాంటిదని, ఒక్కసారి ఆ నగరజీవనం చిక్కుల్లో చిక్కుకుంటే, ఆ బంధనాల నుండి బయటపడడం కష్టమనీ తెలపడమే కవి ఆంతర్యం. నగరవాసులకు తీరిక దక్కదనీ, వారి కోరికలు తీరవనీ, కవి నగరం యథార్థ స్వరూపాన్ని వెల్లడించాడు. నగరంలో కనిపించే పైపై మెరుగులకు మురిసిపోయి పల్లెలను వదలి నగరాలకు రావద్దని, పల్లెవాసులకు హితబోధ చేయడమే కవిగారి ఆంతర్యం.
ఈ) నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జ. నగరంలో మనిషి జీవన విధానం: నగరం మనిషి మాటలతో చిరు వ్యాపారులు అరుపులతో నిండి ఉంటుంది. ఉండటానికి స్థలం దొరకదు. ఇరుకైన మురికి ప్రదేశంలో ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఒకరికి ఒకరు పట్టించుకోరు. మనిషి జీవనంలో స్థిరత్వం లేని హడావుడి కనిపిస్తుంది. ఎల్లప్పుడూ పనిచేస్తుంటారు. కానీ విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. ఏకాకిగా బతుకుతారు. కాలుష్యం కలవరపెడుతుంది.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి.
పల్లెలన్నీ సదుపాయాలను వెతుక్కుంటూ నగరానికి తరలుతున్నాయి.విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు నగరాలకు వస్తున్నారు. ఇలా అన్ని ప్రాంతాల ప్రజలు నగరానికి రావడం వల్ల తలదాచుకోవడానికి స్థలం దొరకడం లేదు. జనాభా పెరిగిపోయింది. ఎత్తయిన భవనాల పక్కనే పూరి గుడిసెలు వెలుస్తున్నాయి. మురుగునీటి పారుదల సరిగా ఉండక, చెత్తా చెదారంతో నిండిపోతోంది. బస్సులు, ఆటోరిక్షాలు, రైళ్లన్నీ నిత్యం జనసమ్మరంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఉపాధి అవకాశాలు విరివిగా దొరకడం వల్ల పల్లెవాసులు నగరాలను ఆశ్రయిస్తున్నారు.
3. కింది అంశం గురించి సృజనాత్మకంగా రాయండి.
అ) మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషిచేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి.
జ. పరిసరాల పరిశుభ్రత
'స్వచ్ఛభారత'ను ఒక మహోద్యమంగా మన ప్రధాని మోదీ, దేశము ప్రచారం సాగిస్తున్నారు. మనం మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దానితోపాటు మన పరిసరాలనూ శుభ్రంగా ఉంచాలి. లేకపోతే సూక్ష్మజీవులు పెరిగి, అంటురోగాలు వస్తాయి. మన ఇంటిలోని చెత్తను వీధిలో పారవేయడం మంచి పనికాదు. చెత్తనంతా చెత్త కుండీలలో వేయాలి.
సాధమైనంత వరకు ఖాళీస్థలాల్లో మొక్కలను పెంచితే వస్తుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఎవరి పరిసరాలను వారు శుభ్రంగా ఉంచుకుంటే, మన పల్లె, మన నగరం, క్రమంగ మనదేశం, పరిశుభ్రంగా అందాల తయారవుతుంది. దేశం పరిసరాల పరిశుభ్రతకు కట్టుకుందాం బృందావనంగా ఆరోగ్య సీమగా మారుతుంది. మనమందరం దీక్షా కంకణం కట్టుకుందాం