TS Class 10 Telugu 8 Lesson
వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ.తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలు ఒక అద్భుతమైన ఘటంగా ఎందుకు అనుకుంటున్నారు ?
జ. సుదీర్ఘకాలం అణచివేయబడుతున్న జాతి, తమ ఆత్మగౌరవం కోసం తరాల తరబడి పోరాడుతున్నది. ఆ పోరాటం ఫలితంగా సిద్ధించిన కొత్త రాష్ట్రాన్ని కళ్ళారా చూసేందుకు రాత్రంతా మేలుకుని కొత్త రాష్ట్రపు ప్రకటనను కనుల నిండా నింపుకున్న ఘట్టం కనుక ఇది ఒక అద్భతమైన ఘట్టమే. సమిష్టిగా జనం అందరూ ఏకమై సాధించిన రాష్ట్రఏర్పాటు గనుక ఇది అద్భుతమైనదే.
ఆ. సంపాదకీయాలలోని భాష, శైలి ఎట్లా ఉంటుంది ?
జ. సంపాదకీయాలు సమకాలీన సామాజిక చైతన్యాన్ని, చారిత్రిక ఘట్టాలనూ, గుర్తు చేస్తూ సాగుతాయి. సంపాదకీయాలలోని భాష సరళంగా పాఠకులు అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగానూ, చిన్న చిన్న పదాలూ, వాక్యాలతో సాగుతుంది. సంపాదకుడు చెప్పాలనుకున్న విషయాలను సూటిగా తెలియజేసేందుకు ఉపయోగపడే సులభ శైలిలో వుంటుంది.) తెలంగాణా పోరాటం ఎందుకురకటమూ సహజమే. వంటి విషయాలు చెబుతూనే కొత్త రాష్ట్రపు కోటి ఆశలను చెప్పగలిగే శైలిలో వుండాలి. సంపాదకీయాలోని భాష, శైలి, ముఖ్యంగా పాఠకుల ఆసక్తిని రాబట్టే విధంగా వుండాలి. సంపాదకీయం చదువగానే కొత్త ఆలోచనలూ, కొన్ని వివరాలు అందేలా ఉండాలి.
ఇ.సంపాదకీయాలు పత్రికలలో ఎందుకు రాస్తారు ?
జ. పాఠకుల, ప్రజల, పాలకుల మధ్య సరియైన సమాచార ప్రసారం కోసం సంపాదకీయాలు రాస్తారు. సమకాలీన సంఘటనలను, సందర్భాలను వ్యాఖ్యాన రూపంలో చెప్పటం కోసం రాస్తారు. గతాన్ని, వర్తమానాన్ని ముడిపెడుతూ భవిష్యత్ కోసం కొత్త ఆలోచనలను మేలుకొలిపేవిగా సంపాదకీయాలు రాస్తారు. పత్రికలు ప్రజలకు, పాలకులకు మధ్యన సారథులుగా ఉండగలవు గనుక వాటి సంపాదకులు వ్యాస రూపంలోనూ, వార్తా వ్యాఖ్య రూపంలోనూ సంపాదకీయాలు రాస్తారు
ఈ. పత్రికల్లోని సంపాదకీయాలకూ, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి ?
జ. సంపాదకీయాలు సమకాలీన సామాజిక సంఘటనలనూ, సందర్భాలనూ చరిత్రలోని ఘట్టాలను స్పర్శిస్తూ సాగుతాయి. సంపాదకీయాలు సంపాదకుని మేధ నుండి వచ్చినవై పాఠకులను ఆలోచింపచేసే కోణంలో వుంటాయి. సాధారణ వార్తాంశాలు ఆయా సంఘటనలను వివరిస్తూ, తెలియజేసేందుకు ఉపకరిస్తాయి. వార్తలో వున్న విషయం ద్వారా వివరణలు అందుకోగలం కానీ విశ్లేషణలూ, ఆలోచింపజేసే అంశాలు తక్కువగా ఉంటాయి.
3.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో సమాధానం రాయండి.
అ. 'సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి'. - దీనిని సమర్థిస్తూ రాయండి.
జ. పత్రికలు ప్రజాస్వామ్యానికి అద్దంలా పనిచేస్తాయి. ప్రజల మనోభావాలకు అనుకూలంగా ప్రభుత్వాలు పని చేసేటట్లు పత్రికలు ప్రభావితం చేస్తాయి. ఒక సామాజిక సమస్య పూర్వాపరాలను తెలుపుతూ, సమకాలీన సంఘటనలతో పోలుస్తూ పత్రికలో రాసే వ్యాసమే సంపాదకీయం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను, వాటి పరిణామాలను, విశేషాలను సంపాదకీయం తెలియజేస్తుంది. ఆనాటి నిజాం వ్యతిరేకోద్యమం నుండి ఈనాటి మనతెలంగాణా ఉద్యమం వరకు
ఉద్యమాలు సఫలీకృతం కావడానికి పత్రికలలోని సంపాదకీయాలు ప్రభావితం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆనాటి గోల్కొండ పత్రిక నుండి ఈనాటి దినపత్రికల వరకు సమకాలీన అంశాలపై సంపాదకీయ వ్యాసాలను వ్రాస్తూనే ఉన్నాయి. నిస్సందేహంగా పత్రికలలోని సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రభావితం చేస్తాయి.