TS CLASS 10 TELUGU LESSON 12

         వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) 'ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు' దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. 
. సాహిత్యం స్థల కాలాదులను నమోదు చేస్తుంది. ఆ కాలానికి సంబంధించి, ఆ ప్రాంత ప్రజల మానసిక విశ్లేషణ, సామ స్థితి గతులు రచనల్లో ప్రతిబింబిస్తాయి. ఒక ప్రాంత చరిత్ర సంస్కృతి ఆ కాలం నాటి రచనలను ప్రభావితం చేస్తాయి. కేశవస్వామి కథల్లో ఆనాడు హైదరాబాద్లో చోటుచేసుకున్న సామాజిక, రాజకీయ పరిణామాలు కనిపిస్తాయి. నిజాం నిర పాలన, ముస్లింల జీవన విధానం, ప్రజాస్వామిక ఉద్యమాలు కేశవస్వామి కథల్లో వివిధ కోణాల్లో చిత్రీకరించబడ్డాయి.

ఆ) తెలంగాణా పలుకుందులు అంటే ఏమిటి ? కొన్ని ఉదాహరణలు రాయండి. 
 జ.తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాటల ఉచ్ఛారణ ప్రత్యేకంగా ఉంటుంది. వాటినే తెలంగాణ పలుకుబడులు అంటారు.
 ఉదా ॥ (1) ఇదిగ కలం ఇగపటు
              (2) పిల్లగాణోళ్ళని బడికి తోలకరండ్రి
             (3) దిగుళ్ళల్లో దీపాలు ఎలుగుత లేవు
              4) జర జూడరాదె. మొదలైనవి.
              
ఇ) "తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది" అనే వాక్యం ద్వారా మీకేమర్థమయిందో తెలుపండి.
జ.1902 నుండి తెలంగాణ కథ ప్రారంభమయ్యింది. అప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశపాలనలో ఎన్నో సాంఘిక దలతో కునారిల్లుతుండేది. తెలంగాణ కథ సామాడిక బాధ్యతను నెత్తినెత్తుకుంది. తెలంగాణ పలుకుబడులను, గ్రామీణ సంస్కృతిని, ప్రజాస్వామిక ఉద్యమాలను, రాజకీయ సామాజిక పరిణామాలను వివిధ కోణాలలో చిత్రీకరిస్తూ కథలు సాగాయి అందుకే తెలంగాణ కథ పుట్టిన నుండి సామాజిక చైతన్యంతోన కొనసాగుతూ వచ్చింది చెప్పవచ్చు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే 'పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్ధం చేసుకోవచ్చు' ఎట్లాగో రాయండి.
జ‌.పుస్తక పరిచయ వ్యాసాన్ని చదివితే పుస్తకంలోని విషయం, ఆదివా ఉద్దేశంతో రాశారు? అనే విషయాలు అవగాహనకు వస్తాయి. ఆ పుస్తకం స్ఫూర్తితో రాశారో, అందులోని లక్ష్యం ఏమిటో అవగ అవుతుంది. రచయిత తన రచనకు ఉపయోగించిన భాష తెలుస్తుంది.
పుస్తక సమీక్ష ద్వారా ఆ పుస్తకం రాసిన విధానంతోపాటు. తీసుకున్న జాగ్రత్తలు తెలుస్తాయి. రచయిత ఎంచుకున్న పుస్తకంలో ముఖ్య అంశాలు తెలుస్తుంది. సమీక్షలో తెలిపిన ముఖ్య అంశాల ద్వారా పుస్తకంలో విషయాన్ని అంచనా వేయవచ్చు. పుస్తకం ముఖ చిత్రం, పుస్తకంలో ప్రస్తుతించిన పదాల పొందిక, తీరు అర్థమవుతుం ఇంకా ఆ పుస్తకం. ఏవిధంగా ఉంటే బాగుండేది అనే సూచనలు అవగతం అవుతాయి. అన్నం మెతుకును చూసి అన్నం ఉడికింది లేదో చెప్పవచ్చు. అలాగే పుస్తక పరిచయ వ్యాసంతో లేదా సమీక్షతో ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రం అర్థం చేసుకోవచ్చు అన్నది వాస్తవం

 అ) కేశవస్వామి కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి.
జ. శవస్వామి చార్మినార్ కథలు ఆనాటి హైదరాబాద్ ప్రజల వాస్తవ జీవితాలు, సామాజిక పరిణామాలను చిత్రీకరించాయి. వితం చేస్తాయి. నెల్లూరి 'యుగాంతం' కథ నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన హైదరాబాద్ రాజ్యం గురించి వివరించింది. రుహీ అపా స్తాయి. నిజాం నిరంకుశ కథ మహోన్నతమైన మానవీయ సంబంధాలను చిత్రిస్తూ, ముస్లిం నవాబుల హృదయ సంస్కారాన్ని ఆవిష్కరించింది. 'కేవలం 'మనుషులం' కథ మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి చక్కగా చెప్పింది. 'ఆఖరి కానుక' కథ ముస్లిం కుటుంబాలలో డబ్బు కోసం ఆడపిల్లలను అరబేక్లకు అమ్మేసే దురాగతాన్ని నిరసించింది. 'వంశాంకురం' కథ కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్ల జీవితాన్ని ఎలా అతలాకుతం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతుందో హృదయ విదారకంగా చిత్రించింది. ఇలా విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాశారు నెల్లూరి కేశవస్వామి గారు. అందుకే గూడూరి సీతారాం గారు వీరిని భారతీయ సుప్రసిద్ధ రచయితలైన ప్రేమచంద్, కిషన్ చందర్ తో పోల్చారు. సీతారాం చెప్పినట్లు కేశవస్వామి కథలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివి. 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా ఒక కథల పుస్తకం తీసుకొని చదువండి. దీనికి పుస్తక పరిచయం (పీఠిక) రాయండి.
జ. మా పాఠశాల (గ్రంథాలయంలో నేను చదివిన కథల పుస్తకం వివిధ దేశాల జానపద పేరిక పుస్తక పరిచయం
వివిధ దేశాల పది కథలు అనే పుస్తకాన్ని రవళి రాశారు. ఇందులో' 'విజయశంఖం - 1 అనే పేరుతో కథలను రాశారు. 6 భాగాలుగా ఈ కథలు ఉన్నాయి. ఇందులో విజయదూల్ సాహనాలు తెలియజేశారు రచయిత మాయా సందర్భాలను తెలియజేస్తూ కథ ముందుకు సాగుతుంది. కోడెనాగు, కరుణపాలుడు, ఒక్కన్న, శక్తివంత్, మదన్ సింగ్ వత్సలాకుమారి దన్, ప్రతాప్, దత్తాత్రేయుడు, సమిష్టుడు లాంటి పాత్రలతో కథ నడుస్తుంది. పాత్రల మధ్య సంబంధాలు, విచిత్రమైన సంఘటనలతో కథ వివరస ప్రధానంగా సాగింది. వెకలిగిగా సాగే ఈ కథ ఆలోచనలను పెంపొందిస్తుంది. మాయా జలంతో జరిగే మార్పులు ఆకట్టుకున్నాయి. ఈ పుస్తకం వెల తక్కువగా ఉంది. అయినా శ్రీనివాసా గ్రాఫిక్స్ విషయం చాలా గొప్పగా ఉంది. లక్ష్మీ గహస్తకాన్ని రంగుల అట్టలతో సుందరంగా తీర్చిదిద్దింది.